Sunday, November 24, 2024
HomeTrending Newsటిబెట్ లో హిమపాతం... ఎనిమిది మంది మృతి

టిబెట్ లో హిమపాతం… ఎనిమిది మంది మృతి

మంచు ఉప్పెన టిబెట్‌లోని నైరుతి ప్రాంతాన్ని ముంచెత్తింది. హిమపాతం కారణంగా అక్కడ ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మెయిన్లింగ్‌ కౌంటీలోని పాయ్‌, మెడోగ్‌ కౌంటీలోని డోక్సాంగ్‌ ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. నియింగ్చి పట్టణానికి సమీపంలోని టన్నెల్ ను హిమపాతం ముంచేత్తటంతో బయటకు వచ్చే అవకాశం లేక మృత్యువాత పడ్డారు. మంచు ఉప్పెనలో ప్రజలు, వాహనాలు చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంచు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చినట్లు తెలిపింది. హిమపాతంలో చిక్కుకుపోయిన వారి కోసం చైనా ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఘటనాస్థలానికి 246 మంది సహాయక సిబ్బందిని పంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

శీతాకాలంలో.. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా మంచు కొండలు ఏర్పడతాయి. మంచు ఒక్కసారిగా విపరీతమైన వేగంతో కొండలపై నుంచి కిందకు రావడాన్ని అవలాంచ్‌ (మంచు తుపాను) అంటారు. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్