Thursday, March 12, 2026
HomeTrending Newsమాస్టర్ ప్లాన్ రద్దు...రైతన్న విజయం - బండి సంజయ్

మాస్టర్ ప్లాన్ రద్దు…రైతన్న విజయం – బండి సంజయ్

కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది రైతు పోరాట విజయం. ఈ విషయంలో ఆయా జిల్లాల రైతులు చూపిన పోరాట స్పూర్తి అని అభినందనలు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో తాను స్వయంగా పాల్గొన్నాని, నాతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు. మాపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదని గుర్తు చేశారు.

కేసీఆర్ పాలనలో రైతులే కాదు…. సామాన్య, మధ్య తరగతి ప్రజలంతా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారని బండి సంజయ్ విమర్శించారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారన్నారు. అవినీతి, కుటుంబ, నియంత పాలనతో రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజార్చారు. కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా మారే దుస్థితి దగ్గరలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ తరుణంలో కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో కామారెడ్డి, జగిత్యాల జిల్లా రైతాంగం చూపిన తెగువ, పోరాట పటిమ అందరికీ ఆదర్శం. వారి స్పూర్తితో ప్రతి ఒక్కరూ కేసీఆర్ సర్కార్ అవినీతి పాలన అంతమయ్యేదాకా పోరాడాలని బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular