Friday, March 29, 2024
HomeTrending Newsఅర్జెంటీనాలో భారీ భూకంపం

అర్జెంటీనాలో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 3:39 గంటలకు భూకంపం వచ్చిందని వెల్లడించింది.

భూ అంతర్భాగంలో 600 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. కార్డోబాకు 517 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. అర్జంటినా భూకంప తీవ్రతకు పొరుగు దేశమైన పరాగ్వే లో ప్రకంపనలు సంభవించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్