Sunday, June 14, 2026
Homeసినిమారేటింగ్స్ పై 'మెగా' కౌంటర్

రేటింగ్స్ పై ‘మెగా’ కౌంటర్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో, బాబీ దర్శకత్వంలో రూపొందిన భారీ మల్టీస్టారర్ వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో కూడా రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ కు  మేకర్స్ ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదు. దాదాపుగా అన్ని వెబ్ సైట్స్ లో  దీనికి 2.25 నుంచి 2.5  మాత్రమే ఇచ్చారు.

ఈ రేటింగ్స్ పై  చిరంజీవి హర్ట్ అయ్యారు. ఇటీవల ఓవర్సీస్ ఫ్యాన్స్ తో  ఆయన ముచ్చటించారు. ఈ మాటల సందర్భంలో మెగాస్టార్ 2.25 రేటింగ్స్ కి కొత్త అర్థం చెప్పారు. “వాల్తేరు వీరయ్య కి కొన్ని వెబ్ సైట్లు 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. 2.25 అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు… ఇప్పుడు అర్థమైంది. 2.25 అంటే 2.25 మిలియన్ డాలర్లని ఇప్పుడు తెలిసింది. ఈ మూవీ ఓవర్సీస్ లో 2.25 మిలియన్ డాలర్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది”  అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి ఇలా స్పందించడంతో తక్కువ రేటింగ్ ఇచ్చిన వారికి  ఈ కౌంటర్ మామూలుగా లేదని అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. చిరంజీవి ఓవర్ సీస్ ఫ్యాన్స్ తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్ అనుకున్న స్థాయిలో  ఆడకపోయినా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read : ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ‘వాల్తేరు వీరయ్య’ – చిరంజీవి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular