Monday, June 15, 2026
Homeసినిమాబాలయ్యతో హరీష్ శంకర్ మూవీ

బాలయ్యతో హరీష్ శంకర్ మూవీ

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి‘ సినిమాతో వీరమాస్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. రెండు వరుస సినిమాలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఓ వైపు సినిమాల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న బాలయ్య.. అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోలో కూడా దూసుకెళుతున్నారు.

దీంతో బాలయ్య నెక్ట్స్ మూవీస్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడితో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఎవరితో అనేది ఇంకా ప్రకటించలేదు కానీ..  హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా చేసేందుకు పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్  స్వయంగా వీరసింహారెడ్డి వీరమాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ప్రకటించారు. అంతే కాకుండా.. మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పారు.

తన మిత్రుడైన గోపీచంద్ మలినేని బాలయ్యతో తీసిన ‘వీరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం రోజు తాను అతిథిగా వచ్చి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశానని.. అప్పుడే బాలయ్యతో ఫుల్ లెంగ్త్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని అన్నారు. తాను సీరియస్‌గా బాలయ్య కోసం ఒక కథ రాసి మెప్పించే ప్రయత్నంలో ఉన్నానని.. తనకంటే కూడా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలైన రవిశంకర్, నవీన్ ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. త్వరలోనే తమ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిస్తున్నానని హరీష్ తెలిపాడు. హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనిపిస్తుంది. మరి.. ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular