Tuesday, April 8, 2025
HomeTrending Newsఅమెరికాలో తెలుగు అమ్మాయి మృతి

అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి

అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత చదువుల కోసం యూఎస్‌ వెళ్లింది. అక్కడ సోమవారం రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో సౌత్ లేక్ యూనియన్‌లోని సియాటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాహ్నవిని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి మృతి చెందింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్