భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్ళు సానియా మీర్జా- రోషన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీ ఫైనల్లో నీల్ కుప్సికి (ఇంగ్లాండ్)- డెసిరై మేరీ (అమెరికా) జోడీపై 7-6;2-1;తో విజయం సాధించి టైటిల్ రేస్ లో నిలిచారు.
శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచే జోడీతో , సానియా-బోపన్న తలపడతారు.