Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్IND Vs NZ: తొలి టి20లో కివీస్ విజయం

IND Vs NZ: తొలి టి20లో కివీస్ విజయం

న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియాకు తొలి టి20లో ఎదురు దెబ్బ తగిలింది. నేడు రాంచీలో జరిగిన మ్యాచ్ లో  కివీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు ఫిన్ అల్లెన్- డెవాన్ కాన్వే 43 పరుగులు చేశారు. అల్లెన్ 35 పరుగులు చేసి ఔట్ కాగా, అదే ఓవర్లో కాంప్మాన్ డకౌట్ అయ్యాడు. కాన్వే-52 పరుగులు చేసి ఔట్ కాగా, డెరిల్ మిచెల్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 5  సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2; అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివం మావి తలా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో ఇండియా 15 పరుగులకే మూడు కీలక వికెట్లు (గిల్-7;  ఇషాన్ కిషన్-4; రాహుల్ త్రిపాఠి డకౌట్) కోల్పోయింది. కెప్టెన్ పాండ్యా- సూర్య కుమార్ యాదవ్ కలిసి నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించారు. పాండ్యా 21; సూర్య-47 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది.

కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, మిచెల్ శాంట్నర్, ఫెర్గ్యూసన్ తలా రెండు; జాకబ్ డఫీ, ఇష్ సోది చెరో వికెట్ పడగొట్టారు.

డెరిల్ మిచెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

రెండో టి20 లక్నోలో ఆదివారం జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్