Saturday, June 13, 2026
Homeసినిమా'ఏజెంట్' వచ్చేస్తున్నాడు..

‘ఏజెంట్’ వచ్చేస్తున్నాడు..

అఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. అయితే.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఏజెంట్ గత కొంత కాలంగా వాయిదాపడుతూనే ఉంది. ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ కి జోడిగా సాక్షి వైద్య నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది.

ఇప్పుడు ఈ భారీ, క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్ 14న ఏజెంట్ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఏజెంట్ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమా విడుదల ఎప్పుడు అనేది ప్రకటిస్తారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఏజెంట్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. విజయవాడలో ఆల్రెడీ ఏజెంట్ కటౌట్ పెట్టి అభిమానులు హంగామా స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 14న ఏజెంట్ రిలీజ్ అంటే.. ఈ సినిమా రిలీజ్ కి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది.

పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న సినిమా అన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి సినిమాకి సంబందించిన కంటెంట్ తో రీచ్ అవుతూ ఉండాలి. మీడియాలో కూడా ఏజెంట్ మూవీ గురించి ఎక్కువ చర్చ జరిగేలా చేయాలి. అందుచేత త్వరలోనే పాన్ ఇండియా రేంజ్ లో బజ్ వచ్చేలా టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి.. అఖిల్ ఏజెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular