Thursday, September 19, 2024
Homeసినిమామహేష్‌ మూవీకి భారీ డీల్ కుదిరిందా.?

మహేష్‌ మూవీకి భారీ డీల్ కుదిరిందా.?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ క్రేజీ కాంబినేషన్లో భారీ చిత్రం రూపొందుతోంది. ఇది మహేష్‌ బాబు 28వ చిత్రం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే..  ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. కారణం ఏంటంటే… ఈ చిత్రానికి వచ్చిన భారీ ఓటిటి డీల్. దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి. మరి దీని పై ఇప్పుడు అసలు క్లారిటీ అయితే మేకర్స్ నుంచి వచ్చింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి అన్ని భాషల్లో 80 కోట్ల ఆఫర్ వచ్చిందని ప్రచారం జరగింది. ఇది నిజమేనట. ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ తో మేకర్స్ 81 కోట్ల కి డీల్ క్లోజ్ చేయగా ఈ చిత్రం అందులో సినిమా థియేట్రికల్ గా రిలీజ్ అయ్యిన 50 రోజుల తర్వాతే అందుబాటులోకి వస్తుందని కన్ఫర్మ్ చేశారు.

మొత్తానికి అయితే.. మహేష్ 28 పై వచ్చిన వార్తలు అయితే నిజమే కాగా ఇంకో కోటి ఎక్కువే ఈ సినిమాకి వచ్చింది. ఇంతలా ఈ సినిమాని దక్కించుకోవడానికి కారణం ఏంటంటే.. మహేష్‌ బాబు నెక్ట్స్ రాజమౌళితో సినిమా చేయనున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమా కోసం హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ని కూడా రంగంలోకి దింపనున్నాడు జక్కన్న. దీంతో మహేష్‌ బాబుకు మరింత క్రేజ్ రావడం ఖాయం. అందుకనే ముందుగానే మహేష్‌ బాబు క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాని భారీ రేటు ఇచ్చి దక్కించుకుంది. మరి.. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్