Sunday, June 14, 2026
Homeసినిమానాగ్ నెక్ట్స్ మూవీలో యంగ్ హీరో..?

నాగ్ నెక్ట్స్ మూవీలో యంగ్ హీరో..?

నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీతో దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన మూవీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ అనే టాక్ వచ్చింది. టాలీవుడ్ మూవీ కాదు.. హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగిందనే టాక్ వచ్చింది కానీ.. జనాలు మాత్రం ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు. దీంతో ది ఘోస్ట్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆతర్వాత చాలా కథలు విని నాగార్జున ఆఖరికి రైటర్ బెజవాడ ప్రసన్న చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

నాగార్జున కొత్త దర్శకులని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి రచయిత బెజవాడ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ప్రసన్న కుమార్ నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. అయితే.. ఈసారి నాగార్జున చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా అని సమాచారం. నాగార్జునతో పాటు యంగ్ హీరో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్ వినిపిస్తోది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. అల్లరి నరేష్.

శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలో ప్రకటించబోతున్నారు. ఇటీవల నాగ్ చేసిన వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ యాక్షన్ మూవీస్. ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. అందుచేత రూటు మార్చి ఈసారి ఎంటర్ టైన్మెంట్ మూవీ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. 70, 80 బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని.. ఖచ్చితంగా ఈ సినిమాతో నాగ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. నాగ్ ఈ మూవీతో ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular