అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. అక్కడ ఉష్ణోగ్రత్తలు తీవ్రంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయిలో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. న్యూహ్యాంప్‌షైర్, మౌంట్ వాషింగ్టన్లో చలి గాలులు విపరీతంగా ఉన్నాయి.
మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో మైనస్ 46 డిగ్రీలు నమోదు అయినట్లు వెదర్ శాఖ తెలిపింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉంటాయని, ఈశాన్య రాష్ట్రాల్లో వెదర్ ప్రాణాంతకంగా ఉన్నట్లు వెదర్ సర్వీస్ వెల్లడించింది.
బోస్టన్, వార్సెస్టర్, మసాచుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో స్కూళ్లను మూసివేశారు. విద్యార్థులు స్కూల్ నుంచి బయటకు వచ్చి బస్సు కోసం వేచి చూసే క్రమంలో హైపోథర్మియా, ఫ్రోస్ట్బైట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. బోస్టన్ మేయర్ ఎమర్జెన్సీ వార్నింగ్ సంకేతాలు ఇచ్చారు. 1773 లో జరిగిన ఘటనను వివరించే బోస్టన్ టీ పార్టీ కి సంబందించిన మ్యుజియం మూసివేశారు. నీటిలో తేలియాడే ఈ మ్యుజియం ముసివేయటం చాలా అరుదుగా జరుగుతుంది.