Saturday, November 23, 2024
HomeTrending Newsటుర్కి సహాయక చర్యల్లో NDRF

టుర్కి సహాయక చర్యల్లో NDRF

భూకంపంతో అతాలకుతలమైన టుర్కిలో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత్‌కు చెందిన తొలి National Disaster Response Force(NDRF) టీమ్‌ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్‌ స్క్వాడ్‌ను కూడా టుర్కికు చేరవేశారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో పంపించారు. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్‌ మెషిన్‌లు, కటింగ్‌ మిషన్‌లు తదితర సామాగ్రి ఉన్నాయి. యాభై మందితో కూడిన తొలి NDRF బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం టుర్కికు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని టుర్కి రాయబార కార్యాలయం కూడా భారత్‌ పంపిన తొలి NDRF టీమ్‌ భూకంప కల్లోలిత ప్రాంతానికి చేరుకుందని ప్రకటించింది. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి మరో NDRF బృందం కూడా టుర్కికు బయలుదేరింది.

 

మరోవైపు తుర్కి ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. ఇక్కడి కరెన్సీ క్రమంగా బలహీనపడుతున్నది. ద్రవ్యోల్బణం రేటు 57 శాతానికి దగ్గరగా ఉన్నది. జీవన వ్యయం పెరగడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో సోమ, మంగళవారాల్లో సంభవించిన భూకంపం.. ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. అమెరికా ఆంక్షల కారణంగా 2018 లో తుర్కియే ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసింది. ఎర్డోగాన్ ఆర్థిక సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుస్తున్నందున రాబోయే రోజుల్లో తుర్కిలో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి.

భూకంపాల వ‌ల్ల ఆ రెండు దేశాల్లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 4900కు చేరుకున్న‌ది. కేవ‌లం తుర్కిలోనే 3381 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఆ దేశ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. సుమారు 20,426 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. తుర్కిలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేల భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం అయ్యాయి. దాదాపు 25వేల మంది ఎమ‌ర్జెన్సీ వ‌ర్క‌ర్లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. రెస్క్యూ ఆప‌రేష‌న్లు జోరుగా సాగుతున్నాయి. గాయ‌ప‌డ్డ‌వారిని త‌ర‌లించేందుకు 10 నౌక‌లు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. సిరియాలో మ‌ర‌ణాల సంఖ్య 1509గా న‌మోదు అయ్యింది. ఆ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Also Read : టర్కీలో భారీ భూకంపం…పొరుగు దేశాల్లోను ప్రభావం

RELATED ARTICLES

Most Popular

న్యూస్