Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Messi-Jersey: ప్రధాని మోడీకి అరుదైన గిఫ్ట్

Messi-Jersey: ప్రధాని మోడీకి అరుదైన గిఫ్ట్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుదైన కానుక అందుకున్నారు. గత డిసెంబర్ నెలలో సాకర్ ప్రపంచ కప్ అందుకున్న అర్జెంటీనా టీమ్ కెప్టెన్ లియోనిల్ మెస్సీ ధరించిన జెర్సీని మోడీకి గిఫ్ట్ గా అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ప్రత్యేకంగా పంపారు.

బెంగుళూరులో నిన్నటి నుంచి మొదలైన ఇండియా ఎనర్జీ వీక్ సదస్సులో పాల్గొనడానికి అర్జెంటీనా నుంచి వచ్చిన పాబ్లో గేరార్డో ద్వారా ఈ కానుకను మోడీకి అందజేశారు.

మేస్సీ నేతృత్వంలో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ లో 4-2 షూటౌట్ తో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో మోడీ అర్జెంటీనా జట్టును అభినందిస్తూ తన సందేశాన్ని ట్వీట్ చేశారు. దీనికి కృతజ్ఞతగా ఈ గిఫ్ట్ ను పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular