మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆతర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సరైన సక్సెస్ కోసం చూస్తున్న టైమ్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశారు. బాబీ తెరకెక్కించిన సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చిరంజీవితో పాటు అభిమానులు ఆశించిన విజయాన్ని అందించింది.
దీంతో చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. సమ్మర్ లో లేదా దసరాకి ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. భోళా శంకర్ మూవీ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారనేది ప్రకటించలేదు కానీ.. వెంకీ కుడుముల, వినాయక్, పూరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా శ్రీకాంత్ అడ్డాల పేరు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే… కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమై సక్సెస్ సాధించాడు. ఆతర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ముకుంద సినిమాతో మెప్పించినా బ్రహ్మోత్సవం సినిమాతో ఆకట్టుకోలేకపోవడంతో కెరీర్ లో గ్యాప్ వచ్చింది. నారప్ప సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట. శర్వానంద్ తో సినిమా ఉంటుందని అందరూ భావించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో శ్రీకాంత్ అద్దాల సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. అయితే.. అది ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి.. చిరంజీవిని శ్రీకాంత్ అడ్డాల ఒప్పిస్తాడా..? అసలు ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.