Saturday, March 2, 2024
HomeTrending Newsగ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన సినీ నటి శ్రీ లీల

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన సినీ నటి శ్రీ లీల

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గచ్చిబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలిటీ (NITHM)లో మొక్కలు నాటిన సినీ నటి శ్రీ లీల..

ఈ సందర్భంగా శ్రీ లీల మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 17కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్పవిషయమని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని శ్రీ లీల కు బహుకరించారు..
ఈ కార్యక్రమంలో NITHM డైరెక్టర్ శేరి చిన్నప్ప రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

న్యూస్