Sunday, June 14, 2026
HomeTrending Newsఆయిల్ కంపెనీలో ప్రమాదం: ఏడుగురు మృతి

ఆయిల్ కంపెనీలో ప్రమాదం: ఏడుగురు మృతి

కాకినాడ జిల్లాలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు  దుర్మరణం పాలయ్యారు. పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని  ఈ ఆయిల్ కంపెనీ ట్యాంకర్ ను  శుభ్రం చేసేందుకు కార్మికులు అందులోకి దిగారు. వీరు లోపలి వెళ్ళగానే దానిలోనుంచి విష వాయువులు వెలువడ్డాయి. దీంతో వీరంతా ఊపిరి ఆడక మరణించారు. వీరిలో ఐదుగురు పాడేరుకు చెందిన వారు కాగా   మండలం  మిగిలిన ఇద్దరిదీ పెద్దాపురం మండలం పులిమెరగా గుర్తించారు.  మృతులను కృష్ణ, నరసింగ, సాగర్, బంజుబాబు, కుర్ర, జగదీశ్, ప్రసాద్ లుగా నిర్ధారణకు వచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా ప్రమాద ఘటనపై స్పందించారు, వెంటనే అధికారులను అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular