Tuesday, June 9, 2026
HomeTrending Newsకొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు విడుదల

కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు విడుదల

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో జగిత్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండగట్టు అభివృద్ధికి రూ.100కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేదుకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం.. భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామిన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular