ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ , 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 223 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ భారత స్పిన్ దెబ్బకు 91 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ 5; జడేజా, షమి చెరో 2; అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
తొలి ఇనింగ్స్ లో 7 వికెట్లకు 321 పరుగుల వద్ద నేడు మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జడేజా-70; అక్షర్ పటేల్-84; షమి-37 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 7; కమ్మిన్స్ 2; లియాన్ ఒక వికెట్ పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో స్టీవెన్ స్మిత్ 25 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా ఇలవడం గమనార్హం.
నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 17న మొదలు కానుంది.
రవీంద్ర జడేజాకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.