హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొత్త కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ ని నియమించింది. ఇకపై అసోసియేషన్ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అసోసియేషన్ లో ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధత అతి త్వరలో సమసిపోవాలని, అందుకే కొత్త కమిటీ ఎన్నిక నిష్పాక్షికంగా, సక్రమంగా జరగాలని, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అప్పటి వరకూ అసోసియేషన్ వ్యవహారాలూ పర్యవేక్షించేందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు తో ఓ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది.