మహిళల టి 20వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా 8వికెట్లతో ఘన విజయం సాధించింది. సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లోబంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో కెప్టెన్ నైగర్ సుల్తానా 57 ( 50 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్సర్); శోర్నా అక్తర్-12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు చేయగలిగింది.
ఆసీస్ బౌలర్లలో వారేహాం 3; డార్సీ బ్రౌన్ 2; మేగాన్ షట్, గార్డ్ నర్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్యం స్వల్పమే అయినా 9 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ (బెత్ మూనీ-2) కోల్పోయింది. రెండో వికెట్ కు అలెస్సా హీలీ-కెప్టెన్ మెగ్ లన్నింగ్ 69 పరుగులు జోడించారు. హీలీ 37 రన్స్ సాధించి అవుట్ కాగా, లన్నింగ్-48; గార్డ్ నర్- 19 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
మూడు వికెట్లతో రాణించిన ఆసీస్ బౌలర్ జార్జ్ వారేహాం కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.