Friday, June 12, 2026
Homeసినిమాచరణ్‌, బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

చరణ్‌, బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న మూవీతో పాటు….  డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ సినిమా తర్వాత చరణ్‌, బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో నూతన నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ నిర్మించనుంది. కానీ ఈ మూవీ ఎప్పటి నుంచి సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని వెయిట్ చేశాడు. కథ ఎన్టీఆర్ కి నచ్చింది. సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఆయన కోసం ఎదురుచూసిన తర్వాత చెప్పింది ఏంటంటే.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు కంప్లీట్ చేయడానికి టైమ్ పడుతుంది.

అందుచేత ఇప్పట్లో నీతో సినిమా చేయలేను అని ఎన్టీఆర్ బుచ్చిబాబుకు చెప్పడంతో.. చరణ్‌ కి కథ చెప్పి ఒప్పించడం.. అనౌన్స్ చేయడం జరిగింది కానీ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. అయితే.. బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా చరణ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. తన అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. త్వరలో సెట్స్ లో కలుద్దాం అన్నారు. రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సో.. బుచ్చిబాబుతో చరణ్‌ చేయనున్న మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు చరణ్‌. మరి.. బుచ్చిబాబు ద్వితీయ విఘ్నాన్ని దాటి సక్సెస్ సాధిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular