ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’  సినిమా చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీనితో మరో సినిమా చేయాలని ఇద్దరూ అనుకుని వెంటనే అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్.. మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్నారు.

అయితే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ ప్రస్తుతానికి ఆగిపోయింది కానీ.. త్వరలో ఖచ్చితంగా ఉంటుందని.. పైగా ఓ భారీ పౌరాణిక చిత్రం చేయాలనుకుంటున్నామని నిర్మాత నాగవంశీ తెలియచేశారు. మరి.. నిజంగానే ఈ సినిమా ఉంటుందా అంటే.. ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాలి. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్ చేయలేదు.

మరో వైపు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేయాలి. ఆతర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయాలి. అయితే.. ఎన్టీఆర్ తో ఫ్యామిలీ స్టోరీ, యాక్షన్ మూవీ చేయడం కంటే.. పౌరాణిక చిత్రం చేస్తే బాగుంటుందని.. పాన్ ఇండియా రేంజ్ మూవీ అవుతుందనేది త్రివిక్రమ్ ప్లాన్ అని తెలిసింది. దీని కోసం చాలా కసరత్తు చేయాలి. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *