మహిళల టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య నేడు రసవత్తరంగా జరిగిన పోరులో 3 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా, ఫాతిమా సనా ఒకటి….అలియా రియాజ్ రెండు ఫోర్లు కొట్టి విజయంపై ఆశలు రేపినా ఐదో బంతికి రియాజ్ ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు.
పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాషడ విలియమ్స్-30; కాంబ్ బెల్లె-22; హీలీ మాథ్యూస్-20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగింది. పాక్ బౌలర్లలో నిదా దార్ రెండు వికెట్లు తీసింది.
లక్ష్యం స్వల్పమే అయినా 15 పరుగులకే ఇద్దరు పాక్ ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. అలియా రియాజ్; నిదా దార్; కెప్టెన్ బిస్మా మరూఫ్ పరుగులు చేశారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేయగలిగింది.
విండీస్ బౌలర్లలో హీలీ మాథ్యూస్ 2; షమీలియా కొన్నెల్, కరిష్మా, అఫీ ఫ్లెచర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
విండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.