Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Women’ T20 WC: కివీస్ భారీ విజయం

Women’ T20 WC: కివీస్ భారీ విజయం

మహిళల టి 20 వరల్డ్ కప్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ 102 పరుగుల తేడాతో అపూర్వ విజయం అందుకుంది. పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశారు.  అమేలియా కేర్ర్ 48 బంతుల్లో 6 ఫోర్లతో 66; 49 బంతుల్లో 6 ఫోర్లతో 56 ; 20 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఆటపట్టు (19); మల్షా షెహానీ (15) మాత్రమే డబుల్ డిజిట్ దాటారు. 15.5 ఓవర్లలో 60 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.

కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ర్, లియా తాహిహు చెరో రెండు; ఈడెన్ కార్సెన్, జెస్ కెర్ర్, హన్నా రో, ఫ్రాన్ జోనాస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

అమేలియా కెర్ర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular