Wednesday, June 17, 2026
Homeసినిమాధనుశ్ కోసం పోటీపడుతున్న యంగ్ డైరెక్టర్స్! 

ధనుశ్ కోసం పోటీపడుతున్న యంగ్ డైరెక్టర్స్! 

కోలీవుడ్ స్టార్ హీరోలలో ధనుశ్ ఒకరు. కోలీవుడ్ లో రజనీ .. కమల్ బరిలోనే ఉన్నారు. అక్కడ విజయ్ – అజిత్ ను తట్టుకుని నిలబడటం కూడా అంత తేలికైన పనేం కాదు. ఇక సూర్య .. కార్తి .. శివ కార్తికేయన్ నుంచి ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయినా తనకి తగిన కథలను ఎంచుకుంటూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ధనుశ్ దూసుకుపోతున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే సినిమాకి .. సినిమాకి మధ్య ధనుశ్ తీసుకునే గ్యాప్ చాలా తక్కువ.

అలాంటి ధనుశ్ కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అన్ని స్క్రీన్స్ ను టచ్ చేశాడు. ధనుశ్ తమిళ సినిమాలు తెలుగులోను వచ్చాయి. అయితే ఈ సారి ఇటు నుంచి నరుక్కుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ‘సార్’ సినిమా చేశాడు. సితార బ్యానర్లో వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. తమిళంలో ఈ సినిమా ‘వాతి’ టైటిల్ తో ప్రేక్షకులను పలకరించింది. రెండు భాషల్లోను ఒకే రోజున ఈ సినిమా విడుదలైంది. అయితే తమిళనాట కంటే ఎక్కువ రెస్పాన్స్ తెలుగులో వస్తుండటం విశేషం.

దాంతో ఇక తెలుగులో కూడా వెంటవెంటనే సినిమాలు చేయాలనే నిర్ణయానికి ధనుశ్ వచ్చాడని అంటున్నారు. ఆల్రెడీ ఆయన శేఖర్ కమ్ములను లైన్లో పెట్టేసి ఉంచాడు. కథ తనకి నచ్చితే చాలు, డైరెక్టర్ సక్సెస్ గ్రాఫ్ ను గురించి ధనుశ్ పట్టించుకోడు. అందువలన ఆయనకి కథలు వినిపించడానికి టాలీవుడ్ కి చెందిన యంగ్ డైరెక్టర్స్ పోటీపడుతున్నారట. మరి ధనుశ్ కి ఎవరి కథ నచ్చుతుందో .. ఆయన నెక్స్ట్ తెలుగు మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Also Read : సార్ స్టూడెంట్స్ సినిమా ..పేరెంట్స్ సినిమా: ఆర్.నారాయణమూర్తి   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular