Thursday, June 11, 2026
Homeసినిమా'సార్' స్టూడెంట్స్ సినిమా ..పేరెంట్స్ సినిమా: ఆర్.నారాయణమూర్తి   

‘సార్’ స్టూడెంట్స్ సినిమా ..పేరెంట్స్ సినిమా: ఆర్.నారాయణమూర్తి   

ధనుశ్ హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘సార్‘ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. విద్యా వ్యవస్థ ఎలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది? సామాన్య విద్యార్థుల జీవితాలపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అనేదే కథ. ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాటపట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్, ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. “స్టూడెంట్స్ కి సంబంధించిన సినిమా హిట్ అయితే అది ఎంత బీభత్సంగా ఉంటుందనేది ‘సార్’ నిరూపించింది. ఇలాంటి ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇది ఆర్ట్ సినిమానా? కమర్షియల్ సినిమానా? అనే విషయంలో దర్శకుడు మాయ చేశాడు. ఆయనను నమ్మి డబ్బుపెట్టిన నిర్మాతకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

ఇది స్టూడెంట్స్ సినిమా .. పేరెంట్స్ సినిమా .. ప్రజల సినిమా. ఒక ‘బడిపంతులు’  .. ఒక ‘సూపర్ థర్టీ’ మాదిరిగా ‘సార్’ కూడా సూపర్ హిట్. విద్య – వైద్యం వ్యాపారం కాకూడదు అనే మెసేజ్ ఇచ్చిన మేకర్స్ కి మరోసారి సెల్యూట్ చేస్తున్నాను. త్వరలో నా నుంచి ‘యూనివర్సిటీ’ అనే సినిమా రానుంది. అది కూడా ఈ కంటెంట్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఆ కథలో మెయిన్ పాయింట్ వేరు. దానిని వెంకీ అట్లూరి టచ్ చేయకపోవడం నా అదృష్టం” అని చెప్పుకొచ్చారు.

Also Read: భారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular