ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరిగిపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్  థ్రిల్లర్ వెబ్ సిరీస్ ల పట్ల యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ బాగుంటే చాలు, ఈ తరహా కంటెంట్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అలాంటి కంటెంట్ తోనే జీ 5 ‘పులి – మేక’ వెబ్ సిరీస్ ను అందించనుంది. కోన వెంకట్ నిర్మాణ సంస్థతో కలిసి, జీ 5 వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.

చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా ఎక్కడైనా ఏదైనా హత్య జరిగితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోతుంటారు. కానీ ఇక్కడ హంతకుడు పోలీసులనే వరుసగా చంపేస్తూ వెళుతుంటాడు. జంతువులా వారిని వేటాడి .. వెంటాడి మరీ చంపుతుంటాడు. ఈ కేసును పరిష్కరించడానికి పోలీస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ రంగంలోకి దిగుతుంది. ఈ కేసు విషయంలో ఆమెకి ఎదురయ్యే సవాళ్లే ఈ కథ.

ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ కూడా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. హంతకుడు ఎవరు? పోలీసులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? అతణ్ణి పట్టుకోవడానికి కిరణ్ ప్రభ ఎలాటి వ్యూహాన్ని అనుసరించింది? అనే విషయాలు ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. నిర్మాణ విలువ విషయాల్లో ఎంతమాత్రం రాజీ పడలేదనే విషయం విజువల్స్ చూస్తేనే  అర్థమవుతోంది. లావణ్య త్రిపాఠి .. ఆది సాయికుమార్ .. సుమన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్,  ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *