పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముడిసరుకు లేక ఔషధాల తయారి నిలిచిపోయింది. చాలా ఆస్పత్రుల్లో సిబ్బందిని తగ్గించేసి… పరిమిత స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే పాక్ ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలో కురుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా పలు సున్నితమైన ఆపరేషన్ల సమయంలో రోగులకు ఇచ్చే అనస్థీషియా (మత్తు మందు) నిల్వలు కూడా రెండు వారాలకు మాత్రమే సరిపడా ఉన్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ముడి సరుకుల దిగుమతి లేకపోవడంతో ఔషధాల ఉత్పత్తి తగ్గిపోయిందని ఫార్మాస్యూటికల్ తయారీదారులు పేర్కొంటున్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తరిగి పోవటంతో… చెల్లింపులు జరగక ఔషధాల ముడి సరుకు కరాచీ ఓడరేవులో నిలిచిపోయింది. సరుకు బయటకు వచ్చేందుకు బ్యాంకుల నుంచి పూచి లభించటం, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్ కు ఎక్కువగా భారత్, చైనా నుంచే ఔషధాల ముడి సరుకు వస్తుంది. సుమారు 95 శాతం మందులు విదేశాల నుంచే వస్తుండగా మిగతా అయిదు శాతం ఈ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
Also Read : పాక్ లో మైనారిటీలపై దాడులు… న్యూయార్క్ లో నిరసనలు