Friday, March 20, 2026
Homeసినిమాసమంతకు గాయాలు: అభిమానుల ఆందోళన

సమంతకు గాయాలు: అభిమానుల ఆందోళన

హీరోయిన్  సమంతకు కష్ట కాలం నడుస్తున్నట్లుంది. మాయో సైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి షూటింగ్ లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ షూటింగ్ లో ఆమె చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆమె ‘ఖుషి’ సినిమాతో పాటుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ లో  నటిస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో  ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేం రాజ్ అండ్ డీకే ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.  ఈ సిరీస్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల ప్రాక్టీస్  సమయంలో ఆమె చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ఈ ఫోటోలను  ఆమె షేర్ చేశారు.

ఈ ఫొటోలు చూడగానే అభిమానులు ఆందోళనతో ఆమెకు సందేశాలు పంపుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular