Thursday, June 18, 2026
HomeTrending Newsవ్యవసాయ శాఖకు సిఎం అభినందన

వ్యవసాయ శాఖకు సిఎం అభినందన

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు గవర్నెన్స్‌ నౌ అంతర్జాతీయ సంస్ధ తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్‌ కేటగిరిలో ఏపీ సీడ్స్‌ కు రెండోసారి గవర్నెన్స్‌ నౌ అవార్డును ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, చైర్‌పర్సన్‌ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు.

 సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. గెడ్డం శేఖర్‌ బాబులు చూపించారు.  వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం రావడం సంతోషమని, మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితంగా అవార్దు దక్కిందని సిఎం వ్యవసాయ శాఖను ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular