Friday, March 29, 2024
HomeTrending Newsదోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ

దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ

తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర నేడు 29 వ రోజు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మామండూరులో రజక సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశం అయ్యారు.

దోబీ ఘాట్స్ లేవని,  ఉన్న చోట కూడా కనీస వసతుల్లేక మహిళలు ఇబ్బందులు పడ్తున్నారని రజకులు లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. కనీసం మధ్యాహ్న భోజనం చెయ్యడానికి కూడా నీడ లేదని, దోబీ ఘాట్స్ కి కరెంటు బిల్లుల మోత భరించలేక పోతున్నామని, దోబి ఘాట్స్ ని కూడా వైసిపి నేతలు వదలడం లేదని వారు లోకేష్ ఎదుట వాపోయారు. చెరువుల్లో బట్టలు ఉతకడానికి వీల్లేదని దౌర్జన్యాలు చేస్తున్నారని, దేవాలయాలు, ఆసుపత్రుల్లో దుస్తులుతికే కాంట్రాక్టులు కూడా రజకులకివ్వకుండా వైసిపి వాళ్లే చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో తామను ఎస్సీ కేటగిరీలో చేర్చారని, మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ ల్లో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మునిరాజమ్మ అనే మహిళ మాట్లాడుతూ  ఏ తప్పు చేయని తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లు కూల్చేస్తే చెట్టు కింద బ్రతుకుతామంటూ వైసిపి వాళ్లకు అణగిమణిగి ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ, రజక సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మకి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని, బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన చోట్ల రజక భవనాలు నిర్మిస్తామని, దోబి ఘాట్స్ లో కనీస వసతులు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్