చందమామ రావే అని మనమంటున్నా… భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్‌లోని నేషనల్ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు గుర్తించారు.
1969లో అపోలో మిషన్ ద్వారా చంద్రునిపై ఏర్పాటు చేసిన ప్యానెళ్ల ఆధారంగా ఈ దృగ్విషయాన్ని గుర్తించారు. దీనికి కారణం ‘మిలంకోవిచ్ సైకిల్’ అని పరిశోధకులు పేర్కొన్నారు.