విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ను 143 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 207 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య సాధనలో గుజరాత్ తేలిపోయింది, 64 పరుగులకే కుప్పకూలింది.
ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సత్తా చాటి కేవలం 30 బంతుల్లో 14 ఫోర్లతో 65; ఓపెనర్ హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 47; అమేలియా కెర్ర్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 45(నాటౌట్) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రానా రెండు; గార్డ్ నర్, తనూజా కన్వర్, వారేహం తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో అడుగుపెట్టిన గుజరాత్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేకపోయింది. ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 23పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెత్ మూనీ (0) పరుగులేమీ చేయకుండానే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. జట్టు మొత్తంలో దయాలన్ హేమలత (29) న మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగింది. ముగ్గురు డకౌట్ అయ్యారు. 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 4; నటాలీ స్కివర్, అమేలియా కెర్ర్ చెరో 2; వోంగ్ ఒక వికెట్ పడగొట్టారు.
హర్మన్ ప్రీత్ కౌర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.