ధరణి పోర్టల్‌తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో 58, 59 జీవో ప్రకారం లబ్ధిదారులకు మంత్రి హరీశ్ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో జీఓ 58 కింద 833 మందికి, జీఓ 59 కింద 471 మందికి భూమి మీద హక్కు కల్పిస్తున్నామన్నారు. భూమిపై సర్వ హక్కులు వస్తాయని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా అత్యంత పారదర్శకంగా పట్టాలిస్తున్నామని వెల్లడించారు.
ధరణిపై అవగాహన లేకుండా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. ధరణితో అవినీతి తగ్గిందని, పారదర్శకత పెరిగిందని చెప్పారు. ఎవరి మండల్లాల్లో వారే భూ క్రయవిక్రయాలు చేసుకున్నారని,
ధరణి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ధరణిని రద్దు చేయడమంటే లంచాలను మళ్లీ తేవడమేనని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టర్‌కు రెండు అవార్డులు సంతోషంగా ఉందన్నారు. హరితహారంలో భాగంగా కలెక్టరేట్‌ను పచ్చదనంతో నింపేశారని అభినందించారు. రాష్ట్రంలో 7 శాతం అడవులు పెరిగాయని వెల్లడించారు.
Also Read : మేం రాగానే ధరణి రద్దు చేస్తాం: రేవంత్