Monday, May 20, 2024
Homeసినిమారీ ఎంట్రీలో ఎస్వీ కృష్ణారెడ్డికి దొరకని సక్సెస్!  

రీ ఎంట్రీలో ఎస్వీ కృష్ణారెడ్డికి దొరకని సక్సెస్!  

కుటుంబ సభ్యులంతా కలిసి చూసే వినోదభరితమైన సినిమాలను మాత్రమే తీస్తానని చెబుతూ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి, ఆ మాటకు కట్టుబడుతూనే అనేక చిత్రాలను తెరకెక్కించారు. అప్పట్లో ఆయన ఏ సినిమా తీస్తే ఆ సినిమా హిట్. కథాకథనాలతో పాటు ఆయన సినిమాల్లో పాటలు కూడా బాగుండేవి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన పాటలు కూడా మనకి కనిపిస్తాయి. ఆయన సినిమాల్లో తప్పకుండా చేయాలని ఆర్టిస్టులు భావించేవారు.

2007లో వచ్చిన ‘బహుమతి’ సినిమా తరువాత కృష్ణారెడ్డి స్పీడ్ తగ్గింది. అప్పటికే ట్రెండ్ మారిపోయింది. సినిమాల నుంచి ఆడియన్స్ కోరుకునే అంశాలు మారిపోయాయి. దాంతో ఆయన సినిమాలకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయేది. అందువలన ఆ సినిమా నుంచి ఆయన తన సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. తనకి భారీ హిట్ ఇచ్చిన ‘యమలీల’కి సీక్వెల్ ద్వారా ఆయన మరికొంత కాలం రేస్ లో నిలబడాలని అనుకున్నారుగానీ వర్కౌట్ కాలేదు.

2014 తరువాత మళ్లీ ఇప్పుడు ఆయన ‘ఆర్గానిక్ మామ ..  హైబ్రీడ్ అల్లుడు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. తాను ట్రెండ్ ను ఫాలో అవుతూనే వస్తున్నాననీ, ఈ ట్రెండ్ కి తగిన సినిమాతోనే వచ్చానని ఎస్వీ కృష్ణా రెడ్డి ఇంటర్వ్యూలలో చెప్పారు. చాలా గ్యాప్ తరువాత ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి ఒక సినిమా వస్తుందనే ఆసక్తిని జనంలో కలిగించలేకపోయారు. కావలిసినంత పబ్లిసిటీ లేకపోవడం .. కథా కథనాల్లో వైవిధ్యం లేకపోవడం కారణంగా, పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్