Tuesday, June 16, 2026
Homeసినిమాఎట్టకేలకు హరీష్ కు డేట్స్ ఇచ్చిన పవర్ స్టార్

ఎట్టకేలకు హరీష్ కు డేట్స్ ఇచ్చిన పవర్ స్టార్

పవన్ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. క్రిష్‌ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు‘ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ.. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇటీవల ‘ఓజీ’ అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుజిత్. అలాగే హరీష్ శంకర్ తో చేయనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ఆమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు లేకుండా ‘వినోదయ సీతం’ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. దీనికి సముద్రఖని డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అయితే.. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న హరీష్ శంకర్ కు పవర్ స్టార్ డేట్స్ ఇచ్చారని.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎట్టకేలకు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది అంటూ నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే.. ఏప్రిల్ 5న ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందని టాక్జ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి డైరెక్టర్ దశరథ్ స్ర్కీన్ ప్లే అందించడం విశేషం. హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని పవర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. ఈసారి పవన్ ను హరీష్ శంకర్ ఎలా చూపిస్తారో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular