Tuesday, June 16, 2026
Homeసినిమాపవర్ స్టార్ లైనప్ మళ్లీ మారిందా..?

పవర్ స్టార్ లైనప్ మళ్లీ మారిందా..?

పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు సినిమాని స్టార్ట్ చేస్తారో… ఎప్పుడు ఎండ్ చేస్తారో ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ కి కూడా తెలియదు. ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అందుకనే వీరమల్లు రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దీంతో ఈ సినిమా విషయంలో నిర్మాత ఏఎం రత్నం చాలా టెన్షన్ పడుతున్నారు. సమ్మర్ కి రావాల్సిన వీరమల్లు దసరాకి వస్తుంది అంటున్నారు. వచ్చే వరకు అనుమానమే.

పవన్ కళ్యాణ్ సినిమాల ఆర్డర్ మొత్తం గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఈ ఆర్డర్ మరోసారి మారిందని తెలిసింది. ప్రస్తుతం ‘వినోదయ సీతం’ అనే రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆతర్వాత సినిమాల షూటింగ్ పరిస్థితి ఏంటి అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ పూర్తిగా లేనట్టే అని చెప్పచ్చు. ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ ను సుజిత్ మూవీకి ఇచ్చారని సమాచారం. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలా ప్లాన్ చేశారు. అయితే.. ఇప్పుడు పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. దీంతో వచ్చే నెల ఆయన ప్లాన్ అంతా మారబోతుందని తెలిసింది. దీంతో పవన్ తో సినిమాలు చేస్తున్న వాళ్లకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమాలను పక్కనపెడితే… ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న వీరమల్లు షూటింగ్ అయినా కంప్లీట్ చేస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular