Tuesday, June 16, 2026
Homeసినిమావిజయ్ దేవరకొండతో రిషబ్ శెట్టి మూవీ నిజమేనా..?

విజయ్ దేవరకొండతో రిషబ్ శెట్టి మూవీ నిజమేనా..?

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే స్టార్ట్ చేసిన ‘జనగణమన’ చిత్రం కూడా ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత కథానాయిక. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కావాలి కానీ.. సమంతకు అనారోగ్యం కారణం షూటింగ్ కి బ్రేక్ పడడంతో మూవీ రిలీజ్ వాయిదాపడింది.

ఇటీవల ఖుషి తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ ఎండింగ్ లో ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే.. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమా ఎవరితో అంటే.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఆ మూవీతో పాటు విజయ్ దేవరకొండ.. పరశురామ్ తో ఓ సినిమా చేయనున్నట్టుగా కూడా ప్రకటించాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అది కూడా రిషబ్ శెట్టితో అని టాక్ వినిపిస్తోంది. కాంతార చిత్రంతో రిషబ్ శెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. కాంతార చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన అల్లు అరవింద్ తన బ్యానర్ లో ఓ సినిమా చేయమని రిషబ్ శెట్టికి ఆఫర్ ఇచ్చారు. అయితే.. విజయ్ దేవరకొండతో రిషబ్ శెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని… అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే… విజయ్, రిషబ్ శెట్టి మూవీ పై మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular