Tuesday, June 16, 2026
Homeసినిమాశ్రీ కళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

శ్రీ కళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 25వ సిల్వర్ జూబ్లీ లోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నైలో పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 25 మంది అవార్డు గ్రహీతలకు వెండి మెమోటోలు ప్రధానం చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ E.S.L నరసింహ గారు, మండలి బుద్ధప్రసాద్, డా|| అలీ, పి.సుశీల గారు, నిర్మాత రవిశంకర్ (మైత్రి మూవీస్) లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ 25వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. 25వ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు అందజేయనున్నాం. ఆస్కార్ అవార్డు పొంది మన తెలుగు వాళ్లకు గర్వకారణమైన చంద్రబోస్ కు సత్కారం, మరియు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు రమేష్ ప్రసాద్ గారికి అందిస్తున్నాం. బాపు – రమణ అవార్డును హను రాఘవపూడికు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి ఈశ్వరి రావుకి అందజేయనున్నాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular