Friday, March 29, 2024
HomeTrending Newsటిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు

టిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు

మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. గ్రాడ్యుయేట్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవగా, ఉపాధ్యాయులు వైసీపీకి బాసటగా నిలిచారు.

ఉత్తరాంధ్ర నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చిరంజీవి రావు నాలుగో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ పై 20 వేల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు.

తూర్పు రాయలసీమలో కంజర్ల శ్రీకాంత్ చౌదరి  మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్ధి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

పశ్చిమ రాయలసీమలో కూడా టిడిపి అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి… వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మూడో రౌంట్ ముగిసే సమయానికి వైసిపి  అభ్యర్ధి 1943 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో YSRCP అభ్యర్థి పర్వత చంద్రశేఖర్ రెడ్డి విజయంసాధించారు.

కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో YSRCP మద్దతిచ్చిన  అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

RELATED ARTICLES

Most Popular

న్యూస్