దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ కొవిడ్ కేసులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. భారత్‌లో కొత్తగా 1,134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 7,026 యాక్టివ్ కేసులున్నాయి. ఐదుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే కేరళలోనూ ఒకరు మహమ్మారితో చెందాడు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.09శాతం నమోదు కాగా.. విక్లీ పాజిటివిటీ రేటు 0.98శాతంగా ఉంది. మరో వైపు కేరళలో కరోనా ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం బుధవారం జిల్లాల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాష్ట్రంలో 172 మందికి వైరస్ సోకిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ పేర్కొన్నారు. తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాల్లో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,026 యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 111 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అన్ని జిల్లాలో సిబ్బందిని అప్రమత్తం చేసింది. పరిస్థితిని పర్యవేక్షించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.