గత ఎన్నికల్లో తమకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్టు అంటూ జగన్ చెప్పారని, ఇప్పుడు 2023లో మార్చి 23వ తారీఖున 23 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడి పంచుమర్తి అనురాధ విజయం సాధించారని, ఇది కూడా దేవుని స్క్రిప్టే అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేవుడు స్క్రిప్టు మళ్ళీ తిరగరాశారని, ఇక మీదట అన్ స్టాపబుల్ అంటూ అభివర్ణించారు. వారి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయలేదని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడిపి కార్యకర్తల సమావేశంలో బాబు ప్రసంగించారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో ఏదో జరిగిపోయిందని సిఎం ప్రచారం చేస్తున్నారని అసలు ఏం జరిగిందో ఆయనకు తెలుసా అని ప్రశించారు. గుజరాత్, తమిళనాడు తో సహా ఐదు రాష్ట్రాల్లో సీమెన్స్ కంపెనీ వచ్చిందని, లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, 370 కోట్లు దోపిడీ జరిగిందని చెబుతున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందని, పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగిరిందని గుర్తు చేశారు.
ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టి, బెదిరించి చేసేది రాజకీయం కాదని… అది రౌడీయిజం, టెర్రరిజం, సైకోయిజం అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే అందరికీ ధైర్యం వస్తోందని, అందుకే బైటకు వస్తున్నారని చెప్పారు.
Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు