ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో కలుసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, వీవీ సూర్యనారాయణ రాజు పెన్మత్స, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణలు జగన్ ను కలుసుకున్నారు. వీరితో పాటు అనంతపురం స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ఎస్. మంగమ్మ కూడా సిఎం ను కలుసుకున్నవారిలో ఉన్నారు.
నూతన ఎమ్మెల్సీలను సిఎం అభినందించారు. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు నూతన ఎమ్మెల్సీలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.