స్విస్ ఓపెన్-2023లో పురుషుల డబుల్స్ లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీస్ మ్యాచ్ లో మలేషియా జోడీ ఆంగ్ యూ సిన్- టోయేఈ పై 21-19; 17-21; 21-17 తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచారు.
నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ ద్వయం జేపీ బే – లస్సే మాల్డే జోడీపై 15-21; 21-11; 21-14 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే,
రేపు జరిగే ఫైనల్స్ లో చైనా ద్వయం రెన్ జియాంగ్ వూ- టాన్ కియాన్ తో తలపడతారు.