రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ,అదానీ వ్యవహారంపై జేపీసీ నియమించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు దద్దరిల్లింది, స్తంభించిపోయింది.విపక్షాలు నల్లచొక్కాలు, కండువాలు ధరించి నిరసనకు దిగడంతో ఉభయ సభలు ప్రారంభమైన నిమిషంలోనే అధికార పక్షం గత్యంతరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో, బీఆర్ఎస్, కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ,ఆప్,ఎస్పీ, డీఎండీకే తదితర పక్షాల సభ్యులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ,ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలను ఎండగడుతూ పార్లమెంటు నుంచి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విజయ్ చౌక్ వరకు మార్చ్ జరిపారు.
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద “సత్యమేవ జయతే” అనే బ్యానరును ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్),కే.కేశవరావు,నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్),బాలు (డీఎంకే)లు మాట్లాడుతూ, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. ఈ ఆందోళనలో యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, జైరాం రమేష్, జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,పీ.రాములు, బడుగుల లింగయ్య యాదవ్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు.
Also Read : Rahul Gandhi Disqualified:రాహుల్ గాంధిపై అనర్హత వేటు