Tuesday, March 17, 2026
Homeసినిమా#BoyapatiRapo: బోయపాటి, రామ్ మూవీ అక్టోబర్ 20న విడుదల

#BoyapatiRapo: బోయపాటి, రామ్ మూవీ అక్టోబర్ 20న విడుదల

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘#BoyapatiRAPO’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్‌ లో ఎక్కువగా ఉండబోతున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

#BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. మాస్‌ తో పాటు ఫ్యామిలీస్‌ ని మెప్పించే సినిమాకి ఇది సరైన తేదీ. దసరా సెలవులు సినిమాకి  కలిసిరాబోతున్నాయి.అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు ఎద్దుని లాగుతూ పోస్టర్‌ లో రగ్డ్, మాస్‌ గా కనిపిస్తున్నారు. డెనిమ్స్‌ షర్టు, జీన్స్‌ లో క్లాస్‌ గా ఫ్యాషనబుల్‌ గా కనిపిస్తున్నప్పటికీ, అతని ముఖంలో వైల్డ్ నెస్ కనిపిస్తుంది. బోయపాటి రామ్‌ ని మాస్ క్యారెక్టర్‌ లో చూపిస్తున్నారు.మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్  శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.

అయితే దసరాకి ముందుగా అంటే జూన్ లో బాలకృష్ణ 108వ సినిమా రిలీజ్ అనుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఆగస్టులో చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ కి ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం ప్లాన్ ప్లానింగ్ మారినా,  అవి సెట్ చేసుకునేది దసరానే. ఇక దసరాలోగా పూర్తయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. గట్టి పోటీకి సిద్ధపడే రామ్ రంగంలోకి దిగితే ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఏవుంటుంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular