Saturday, November 23, 2024
HomeTrending NewsRefugees die:మెక్సికోలో 39 మంది శరణార్థుల దుర్మరణం

Refugees die:మెక్సికోలో 39 మంది శరణార్థుల దుర్మరణం

మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 29 మందికి కాలిన గాయాలయ్యాయి. సొంత దేశంలో ఉండలేక, అగ్రరాజ్యం అమెరికాలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తూ అగ్ని కీలలకు బలైపోయారు. శరణార్థులు పరుపులకు నిప్పంటించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

శరణార్థి కేంద్రం నుంచి తమను బయటకు పంపిస్తున్నారనే ప్రచారం జరగడంతో వలసదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగానే కొందరు శరణార్థి కేంద్రంలోని పరుపులకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించాయి. అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్‌లోని శరణార్థుల కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది.

వేర్వేరు దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది అధికారిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇక్కడి శరణార్థుల కేంద్రంలోనే ఉంటారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్​ కార్యాలయం దర్యాప్తునకు ఆదేశించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్