న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో కూడా శ్రీలంక పరాజయం పాలైంది. దీనితో ఈ ఏడాది జూలై లో జరిగే వన్డే ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. జింబాబ్వేలో జరిగే క్వాలిఫైర్ మ్యాచ్ లు ఆడి తొలి రెండు స్థానాల్లో నిలిస్తేనే లంకకు అవకాశం ఉంటుంది.
హామిల్టన్ లో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 18 పరుగులకే మూడు వికెట్లు (ఫెర్నాండో-; కుశాల్ మెండీస్-డకౌట్; అంగ్లో మాథ్యూస్-డకౌట్) కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ పాతుమ్ నిశాంక-57; కెప్టెన్ శనక-31; కరుణరత్నే-24; ధనుంజయ డిసిల్వా-13… మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కివీస్ బౌలర్లు మాట్ హెన్రీ, షిప్లే-; డెరిల్ మిచెల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
కివీస్ కూడా 21 పరుగులకే మూడు వికెట్లు (చాడ్ బోస్-1; టామ్ బ్లండెల్-4; డెరిల్ మిచెల్-6) కోల్పోయింది. కెప్టెన్ లాథమ్ కూడా కేవలం 8పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో విల్ యంగ్- హెన్రీ నికోలస్ లు నాలుగో వికెట్ కు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి 32.5 ఓవర్లలో విజయం అందించారు. యంగ్-86; నికోలస్ -44 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.
లంక బౌలర్లలో లాహిరు కుమారా 2; కసున్ రాజిత, శనక చెరో వికెట్ సాధించారు.
విల్ యంగ్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, హెన్రీ షిప్లే ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ అందుకున్నారు.