ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 సీజన్ రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ 7 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 191 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో 16 ఓవర్లకు 7 వికెట్లకు కోల్పోయి 146 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో డక్ వర్త్ లూయీస్ (DLS) పధ్ధతి ప్రకారం పంజాబ్ ను విజేతగా ప్రకటించారు.
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, పంజాబ్ లో భానుక రాజపక్ష-50; కెప్టెన్ శిఖర్ ధావన్-40; ప్రభ్ సిమ్రాన్-23; జితేష్ శర్మ-21; రాజా-16 పరుగులు చేసి ఔట్ కాగా, శామ్ కర్రన్-26; షారుక్ ఖాన్-11 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. కోల్ కతా బౌలర్లలో సౌతీ 2; ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆండ్రీ రస్సెల్-35; వెంకటేష్ అయ్యర్-34; కెప్టెన్ నితీష్ రానా-24 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్(8)-; సునీల్ నరైన్-(7) క్రీజులో ఉండగా… నాలుగు ఓవర్లలో 46 పరుగులు కావాల్సిన దశలో వర్షం పడి ఆట నిలిచిపోయింది.
పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3; శామ్ కర్రన్, నాథన్ ఎల్లిస్, సికందర్ రాజా, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అర్ష్ దీప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.